బాబు ఎదుట టిడిపి లుకలుకలు

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలోని లుకలుకలు బయటపడ్డాయి. పార్టీ పోలిట్ బ్యూర్, కార్యవర్గ సభ్యుల చేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పార్టీలోని విభేదాలు బయటపడ్డాయి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ నాయకులు తలసాని శ్రీనివాస యాదవ్, హరీశ్వర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి డుమ్మా కొట్టారు. పోలిట్ బ్యూరోలో స్థానం దక్కనందుకు నిరసనగా హరీశ్వర్ రెడ్డి సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవికి తనను అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ వస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తనకు ఏ విధమైన హామీ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. వ్యవసాయాధికారి రాజేశ్వరి ఆత్మహత్య కేసులో శాసనసభ్యురాలు సీతా దయాకర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆమెను చంద్రబాబు తెలుగు మహిళ అధ్యక్షురాలిగా నియమించారు. అయితే ఆ పదవిని తాను ఇప్పుడే చేపట్టలేనని, ఏడాది తర్వాత ఆ బాధ్యతలు తీసుకుంటున్నానని సీతా దయాకర్ రెడ్డి చంద్రబాబుకు ఇప్పటికే చెప్పారు.

పార్టీని ముందుకు నడిపించడానికి చురుగ్గా ముందుకు కదలాలని చంద్రబాబు నాయకులకు పిలువునిచ్చారు. తమ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెసు ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆర్థికంగా దెబ్బ తీసే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని ఆయన విమర్శించారు. పార్టీకి జవజీవాలు సమకూర్చాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. తెలుగు మహిళ అధ్యక్ష పదవిని ఆశించిన నన్నపనేని రాజకుమారి కూడా సమావేశానికి రాలేదు. ఆమె పార్టీ నాయకత్వంపై గతంలో తీవ్ర విమర్శలు కూడా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+