వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలీవుడు నటుడు నాసిర్ ఖాన్ అరెస్టు

By Santaram
|
Google Oneindia TeluguNews

Nasir Khan
కటక్‌: బాలీవుడ్‌ నటుడు, నిర్మాత, ఫైన్‌ ఇండి సెల్‌ అనే సంస్థ ఎమ్డీ నాసిర్‌ ఖాన్‌తో పాటు అతని సన్నిహితుడు సయ్యద్‌ అహ్మద్‌లను ఒరిస్సా పోలీసులు మంగళవారం కటక్‌ లో అరెస్టు చేశారు. హైకోర్టు ఆవరణలో వీరిని అరెస్ట్‌ చేయడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్‌ ఐ.ఎం. ఖుద్దుసీ, జస్టిస్‌ సంజు పండాలతో కూడిన ధర్మాసనం వారిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. కేసును పరిశీలించి బెయిలు మంజూరు చేసింది.

ఫైన్‌ ఇండి సెల్‌ పేరిట ఆన్‌లైన్‌ చిట్‌ఫండ్‌ సంస్థను నడుపుతున్న నాసిర్‌ ఖాన్‌ బాలాసోర్‌ జిల్లాలో రూ. కోట్లు సేకరించి పలువురిని మోసం చేసినట్లు ఒరిస్సా హైకోర్టులో కేసు నమోదైంది. ఆ కేసు విచారణకు కోర్టుకు వచ్చిన నాసిర్‌, అహ్మద్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X