తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో సెల్లార్ దర్శనాలు రద్దు

By Santaram
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: శ్రీవారి దర్శనాన్ని భక్తులకు మరింత సులభతరం చేసేందుకు ఏర్పాటు చేసిన శ్రీఘ్ర దర్శనం కౌంటర్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ ఆదికేశవులు నాయుడు బుధవారం ఉదయం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో నేటి నుంచి నుంచి సెల్లార్‌, ఏఏడీ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో కృష్ణారావు కూడా పాల్గొన్నారు. సామాన్య భక్తులకు కూడా స్వామి దర్శనం త్వరగా అయ్యేలా చూసేందుకు, దళారుల బెడదను తొలగించేందుకు, దర్శనం సమయాన్ని పెంచడం ద్వారా శీఘ్రంగా దర్శనం చేయించేందుకు టిటిడి కార్యాచరణ సిద్ధం చేసింది.

శ్రీవారి శీఘ్ర దర్శనానికి కూడా పండితులు ముహూర్తాన్ని నిర్ణయించారు. శీఘ్ర దర్శనం చేయాలనుకునే వారి కోసం ఒకటో నెంబర్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముఖద్వారం వద్ద టిటిడి కౌంటర్ ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్ లో మూడు వందల రూపాయలతో టిక్కెట్ కొన్నవారు ఆలయం మహా ద్వారం వరకూ ఎలాంటి ఆటంకమూ లేకుండా వెళ్ళవచ్చు.

విఐపి దర్శనాలను నియంత్రించడంలో భాగంగా మంగళవారం నుంచి ఎఎడి, సెల్లార్ దర్శనాలను టిటిడి పాలకమండలి రద్దు చేసింది. శీఘ్ర దర్శనం టిక్కెట్ కొన్న వారికి త్వరగా అతి తక్కువ సమయంలోనే స్వామి దర్శనం చేసుకొనే వీలుంటుంది. అలాగే శీఘ్ర దర్శనం చేసుకున్నవారు దర్శనానంతరం తిరుమల కొండపై ఉండాలనుకుంటే శీఘ్ర దర్శనం టిక్కెట్ చూపిస్తే వసతి కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X