హైదరాబాద్: హైదరాబాదులోని అమీనాపూర్ లో గల ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి అదృశ్యమయ్యాడు. కళాశాలలోని ఐఐటి క్యాంపస్ నుంచి అతను మాయమయ్యాడు. ఈ విషయంపై విద్యార్థి తల్లిదండ్రులు కూకట్ పల్లి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు.
సాయిచరణ్ అనే ఆ విద్యార్థి అనంతపురానికి చెందినవాడు. అతను హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.