మేవాడ్, గోవా రైళ్ల ఢీ: 21 మంది మృతి

ఈ ప్రమాదంతో ఆరు రైళ్లను దారి మళ్లించారు. ఐదు రైళ్లను రద్దు చేశారు. గాయపడిన వారిని మధుర, బృందావన్ ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు సాగుతున్నాయి. రెండు రైళ్లు బుధవారం తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఢీకొట్టుకున్నాయి. మేవాడ్ ఎక్స్ ప్రెస్ కు చెందిన ఒక బోగీ పూర్తిగా దెబ్బ తిన్నది. మేవాడ్ ఎక్స్ ప్రెస్ లోని బోగీని కట్ చేసి గాయపడిన 15 మందిని వెలికి తీసినట్లు, వారిని ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ దినేష్ చంద్ర శుక్లా తెలిపారు.
గోవా ఎక్స్ ప్రెస్ పాంట్రీ కారు కూడా ధ్వంసమైంది. మేవాడ్ ఎక్స్ ప్రెస్ గార్డు, పాంట్రీ కారుకు చెందిన ఇద్దరు సిబ్బంది ప్రమాదంలో మరమించారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ ఐదు లక్షల రూపాయలేసి ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
ఢిల్లీ హెల్ప్ లైన్ నెంబర్స్: 011-24359748, 011 - 2435596
మధుర హెల్ప్ లైన్ నెంబర్లు: 0565-2402008, 0565-242009












Click it and Unblock the Notifications