ఢిల్లీకి వైయస్ జగన్ ప్రయాణం

YS Jagan
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి ఆయన ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ప్రారంభమైన స్టాండింగ్ కమిటీ సమావేశం గురువారంవరకు సాగుతుంది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి.

రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఆయన కూడా స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకే ఢిల్లీ వెళ్లారు. జగన్ ఢిల్లీ పర్యటనలో కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులతో భేటీ అయ్యేందుకు ప్రయత్నించవచ్చుననే ప్రచారం జరుగుతోంది. కెవిపి మంగళవారం రాత్రి సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ తో సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+