వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర సిఎంగా మళ్లీ అశోక్ చవాన్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Ashok Chavan
ముంబై: పలువురు పోటీ పడుతున్నప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తిరిగి అశోక్ చవాన్ నే వరించే అవకాశాలున్నాయి. శాసనసభ ఎన్నికల్లో విజయాన్ని చేకూర్చి పెట్టిన ముఖ్యమంత్రిగా తిరిగి అధిష్టానం ఆయనకే అవకాశం ఇచ్చేందుకు సముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం తన వైఖరిని వెల్లడించలేదు. వివాదరహితుడిగా, వివిధ అధికారిక కేంద్రాల మధ్య సమన్వయం సాధించిన నేతగా అశోక్ చవాన్ కు పేరుంది. దీంతో ఆయన తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి పరిస్థితి మెరుగ్గా ఉంది. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అత్యంత విధేయుడిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.

ఫలితాలు వెలువడిన వెంటనే తిరిగి అధికారం చేపట్టేందుకు అవసరమైన ఎత్తుగడలకు ఆయన పూనుకున్నారు. తన పాలనను అంచనా వేయడానికి తొమ్మిది నెలల కాలం సరిపోదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని కూడా ఆయన చెప్పారు. మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు కేంద్ర మంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ ఉవ్విళ్లూరుతున్నారు. శాసనసభ్యుడే ముఖ్యమంత్రి కావాలని ఏమీ లేదని ఆయన అన్నారు. అయితే తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని, ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన ఆ తర్వాత అన్నారు. అభ్యర్థులు ఎంపికలో ఆయన కీలక పాత్ర పోషించారు కూడా. ప్రచార బాధ్యతలను కూడా నిర్వహించారు. ఇటీవలే ఆయన లోకసభకు ఎన్నికయ్యారు. అందువల్ల అధిష్టానం ఆయన పేరును ముఖ్యమంత్రి పదవికి పరిశీలనకు తీసుకునే అవకాశం లేదని అంటున్నారు.

ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న ప్రముఖుల్లో పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే కూడా ఉన్నారు. గతంలో కూడా ఆయన ఆ పదవి కోసం పట్టుబట్టారు. విలాస్ రావు దేశ్ ముఖ్ ను తొలగించిన సమయంలో ఆయన ఆ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డారు. రాణే వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని అధిష్టానం భావన.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X