వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ స్పందించాలి: పొన్నం డిమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
న్యూఢిల్లీ: హైదరాబాద్ ఫ్రీజోన్ పై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీరు దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల కన్వీనర్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఫ్రీజోన్ కేసు కోర్టులో ఉన్నప్పుడు కెసిఆర్ చేసిన ఘనకార్యమేమిటని ఆయన అడిగారు. తెలుగుదేశం పార్టీ సవాల్ ను కెసిఆర్ స్వీకరించి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి గెలవాలని ఆయన శుక్రవారం డిమాండ్ చేశారు. తమ మద్దతుతో గెలిచిందున కెసిఆర్ రాజీనామా చేసి తిరిగి గెలవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం కెసిఆర్ ను డిమాండ్ చేశారు.

కెసిఆర్ వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల గౌరవం సన్నగిల్లుతోందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుతడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ అంశానికి సోనియా నాయకత్వంలోనే పరిష్కారం లభిస్తుందని, సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. యుపిఎలో ఉన్నప్పుడు కెసిఆర్ కూడా సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. తెరాస కాంగ్రెసుతో ఉంటే తెలంగాణ విషయంలో ప్రగతి సాధ్యమయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X