హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కామ్రేడ్ గణపతి క్లిప్స్ సంచలనం

By Santaram
|
Google Oneindia TeluguNews

Maoists
హైదరాబాదు: మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి వీడియో దృశ్యాలు లభ్యమయ్యాయి. నక్సల్స్‌సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తున్న వీడియో క్లిప్పింగులు అనేక టీవీ ఛానళ్లలో శనివారం ఉదయం ప్రసారమయ్యాయి. ఇవి బీహార్‌లో జరిగిన మావోయిస్టు కాంగ్రెస్‌ సమావేశాల్లో ప్రసంగిస్తున్న దృశ్యాలని తెలుస్తోంది. పోలీసులు ఎనో ఏళ్ళుగా గణపతి కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు గణపతికి సంబంధించి చిన్న ఫొటో కూడా బయటికి రాలేదు. ఏకంగా వీడియో దృశ్యాలు బయట పడటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గణపతి వెలమ దొరల కుటుంబంలో పుట్టినా ఉద్యమ బాట పట్టడం విశేషం.

ఇరవై ఏళ్లలో ఎప్పుడూ బయటికి రాని గణపతి దృశ్యాలు ఇపుడు బయట పడటం వెనక వ్యూహం ఏమై ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఆ దృశ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు పంపించారో ఇంకా తెలియడం లేదు. ఆంధ్రజ్యోతి టీవీ గణపతితో ఇంటర్వ్యూ ఆడియోను ప్రసారం చేసినా వీడియో ఇవ్వలేదు. గణపతి కరీంనగర్‌ జిల్లా సారంగపూర్‌ మండలం బీర్‌పూర్‌కు చెందిన వ్యక్తి. ఆయన టీచర్‌గా పనిచేస్తున్నపుడు ప్రజల సమస్యలపై పోరాడుతూ.. నక్సల్స్‌ భావజాలానికి ఆకర్షితులై..మావోయిస్టుల్లో చేరారు. అంచలంచెలుగా అగ్రనాయకునిగా ఎదిగారు. గణపతి అసలు పేరు ముప్పాళ్ల లక్ష్మణరావు. అయనకు కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X