కర్నూలు: మహానంది శైవక్షేత్రంలో నవంబర్ 2వ తేదీన అంటే రేపు కార్తీక పౌర్ణమి నాడు కోటి దీపాలంకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ శశిధర్రెడ్డి శనివారం తెలిపారు. గుం టూరు జిల్లా గణపవరం గ్రామానికి చెందిన కపోతేశ్వర భక్త బృందం నెల రోజుల పాటు తయారు చేసిన కోటి వత్తులను ఆలయ ప్రాంగణంలో వెలిగిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అలాగే క్షేత్రంలోని ఆర్యవైశ్యసత్రంలో పౌర్ణమి నాడు 6 వేల దీపాలంకరణ నిర్వహిస్తామని సత్రం నిర్వాహకులు తెలిపారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి