చిరుతో పొత్తు యత్నాలు వైయస్ వే

నిజానికి, అప్పటి నుంచే చిరంజీవితో కాంగ్రెసు స్నేహానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయంలో మంత్రి బొత్సా సత్యనారాయణ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో శాసనసభ సమావేశాలు జరుగుతుండగా మంత్రి బొత్సా సత్యనారాయణ పలుమార్లు చిరంజీవితో సమావేశమయ్యారు. బొత్సా సత్యనారాయణ చిరంజీవి సామాజిక వర్గానికి చెందినవారే కావడం వల్ల ఆ పనిని ఆయనకు అప్పగించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజారాజ్యంతో పొత్తును బొత్సా సత్యనారాయణ సమర్థిస్తుండడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.
ప్రజారాజ్యంతో పొత్తుపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని బొత్సా సత్యనారాయణ సోమవారం అన్నారు. పొత్తును వ్యతిరేకిస్తూ కొందరు ప్రకటనలు చేయడాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెసులో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, వైయస్ ఒకందుకు చిరంజీవితో పొత్తుకు యత్నిస్తుంటే మరొకందుకు కాంగ్రెసు నాయకులు ప్రజారాజ్యం పార్టీతో పొత్తుకు సిద్ధపడుతున్నారు. జగన్ శిబిరాన్ని తొక్కిపెట్టడానికి ఈ పొత్తు పెట్టుకుంటారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కాంగ్రెసుకు బొటాబొటీ మెజారిటీయే ఉండడంతో ఎందుకైనా మంచిదని రాజశేఖర రెడ్డి అప్పట్లో చిరుతో స్నేహానికి ప్రయత్నాలు సాగించారు.












Click it and Unblock the Notifications