వైయస్ జగన్ కు చెక్ పెట్టేందుకే...

కాంగ్రెసుతో పొత్తు చిరంజీవికి తన నేతలను కాపాడుకోవడానికి పనికి వస్తుందని భావిస్తున్నారు. పార్టీ భవిష్యత్తు లేదనే అభిప్రాయం బలంగా ఉన్న నేపథ్యంలో పొత్తు వల్ల వారికి ఆత్మస్థయిర్యం కలిగించడానికి ఇది పనికి వస్తుందని అంటున్నారు. గత రెండు రోజులుగా చిరంజీవి పార్టీ నాయకులతో విస్తృతంగా చర్చించి పొత్తుపై నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకే ఈ పొత్తు పరిమితం కాదని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని అంటున్నారు. దూరదృష్టితో కాంగ్రెసు పార్టీ ప్రజారాజ్యం పార్టీని కలుపుకుని పోవాలని భావిస్తోంది. 2104 ఎన్నికల్లో చిరంజీవి ఇమేజ్ ద్వారా, తన సంస్థాగత నిర్మాణం ద్వారా విజయం సాధించడానికి ఈ పొత్తు పునాదిగా భావిస్తున్నారు.
ఇరు పార్టీలకు ఈ పొత్తు అవసరంగా మారిందని చెప్పవచ్చు. రాజకీయంగా మనుగడ సాగించడానికి చిరంజీవికి, భవిష్యత్తు విజయానికి కాంగ్రెసుకు ఈ పొత్తు అవసరంగా మారిందని అంటున్నారు. చిరంజీవిని కలుపుకుని పోవడానికే కాంగ్రెసు పార్టీ మజ్లీస్ తో పొత్తుకు నిరాకరించినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications