జగన్ ను సిఎం చేసే వరకు పోరు: మురళి

జలయజ్ఞంలో వేల కోట్ల రూపాయలు సంపాదించిన పొన్నాల అవినీతిైప సిబిఐతో విచారణ జరిపించాలని పార్టీ అధినేత సోనియా గాంధీని కోరుతానని ఆయన చెప్పారు. పొన్నాల అవినీతి వల్లనే జలయజ్ఞం నీరు గారిందని ఆయన నిందించారు. జలయజ్ఞాన్ని పొన్నాల ధనయజ్ఞంగా మార్చారని ఆయన అన్నారు. ఎస్సార్ఎస్పీ, దేవాదుల ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతా లోపం వల్ల ఒక్క ఎకరానికి కూడా నీరు అందడం లేదని ఆయన అన్నారు. వరంగల్ లోని వైయస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి ఆయన పావురాల గుట్టకు బయలుదేరారు. కొండా దంపతుల వెంట పావురాలగుట్టకు కార్యకర్తలు కూడా బయలుదేరారు.












Click it and Unblock the Notifications