• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రత్యేక పోలీసాఫీసరుగా రుక్సానా నియమాకం

By Pratap
|

Rukhsana
జమ్ము: అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి లష్కరే తోయిబా మిలిటెంటును హతమార్చిన జమ్ములో రుక్సానా కౌషర్ ప్రత్యేక పోలీసు అధికారిగా నియమితులయ్యారు. ఆమె సోదరుడిని పోలీసుగా, అంకుల్ ను పోలీసాఫీరుగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. సెప్టెంబర్ 27వ తేదీన రుక్సానా తన ఇంటిలో లష్కరే తోయిబా మిలిటెంటును హతమార్చారు.

రుక్సానాను ప్రత్యేక పోలీసాఫీసరుగా ఇటవీల నియమించినట్లు, ఆమె తన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ షఫ్కత్ వట్టాలి చెప్పారు. భద్రతా కారణాల రీత్యా రుక్సానాను ఢిల్లీకి పంపినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఆమెను గానీ ఆమె తల్లిదండ్రులను గానీ ఢిల్లీకి మార్చలేదని ఆయన స్పష్టం చేశారు. ఎంఎస్ భిట్టా నేతృత్వంలోని అఖిల భారత ఉగ్రవాద నిరోధక ఫ్రంట్ కార్యక్రమంలో అవార్డు స్వీకరించడానికి రుక్సానా ఇటీవల ఢిల్లీ వెళ్లినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X