హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మావోయిస్టు అగ్రనేతకూ రాష్ట్ర మంత్రికీ చుట్టరికం!

By Santaram
|
Google Oneindia TeluguNews

Maoists
హైదరాబాద్: మావోయిస్టుల ఆగ్రనేత గణపతి తమ(వెలమ) కులానికే చెందినవాడని పౌరసరఫరాల మంత్రి జూపల్లి కృష్ణారావు గర్వంగా చెప్పారు. బ్రహ్మనాయుడి వారసులైన వెలమలు రాజకీయాలతో పాటు వ్యాపారంలోనూ రాణిస్తున్నారని చెబుతూ..మైహోమ్‌, యశోదా ఆస్పత్రులను అందుకు ఉదాహరించారు. హైదరాబాద్‌కు సమీపంలోని దేవర్‌యాంజాల్‌లో జరిగిన వెలమ సభలో జూపల్లి మాట్లాడా రు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. వెలమ సంఘం నిర్మించిన జూపూడి బాలమ్మ కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు.

టీఎన్‌ఆర్‌ వెలమ సాంస్కృతిక కేంద్రానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సభకు రాలేకపోయిన సీఎం రోశయ్య తన సందేశ పత్రాన్ని ధర్మాన ద్వారా పంపారు. ఇతరుల ప్రయోజనాలను తొక్కిపెట్టడం, దెబ్బతీయడం వంటివి లేకపోతే కుల సమీకరణ తప్పు కాదని ధర్మాన చెప్పారు. చెన్నాడి సుధాకరరావు హయాంలో కళ్యాణ మండపం నిర్మించడం ముదావహమని ఆర్టీసీ చైర్మన్‌ ఎం.సత్యనారాయణరావు కితాబిచ్చారు. కళ్యాణ మండపం ద్వారా వచ్చే ఆదాయంలో 75 శాతం పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తామని వెలమ సంఘం అధ్యక్షుడు చెన్నాడి సుధాకరరావు ప్రకటించారు.

కల్యాణ మండల స్థాపన కోసం విరాళాలిచ్చిన జూపల్లి రామేశ్వరరావు, బీ నిర్మాలాదేవి, డాక్టర్‌ సురేందర్‌రావు, కే ప్రేమసాగర్‌, కొండలరావులను వెలమ సంఘం దుశ్శాలువ సత్కరించింది. కార్యక్రమంలో కోటగిరి విద్యాధరరావు, సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే తారక రామారావు, వడ్డేపల్లి నర్సింగరావు, బోయినపల్లి వినోద్‌కుమార్‌, జువ్వాడి రత్నాకర్‌రావు, నూకారపు సూర్యప్రకాశరావు, జూపల్లి రామేశ్వరరావు, యశోదా ఆస్పత్రుల అధినేత డాక్టర్‌ సురేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X