వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ కు మోహన్ బాబు పరామర్శ

By Santaram
|
Google Oneindia TeluguNews

Mohan Babu
హైదరాబాద్‌: కుమారుడి ద్వారా చుట్టరికం ఏర్పడిన వైయస్ కుటుంబాన్ని నటుడు మోహన్ బాబు పరామర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు కడప ఎంపీ వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డిని మోహన్‌ బాబు కలుసుకున్నారు. తనయుడు మంచు విష్ణుతో కలిసి వచ్చిన మోహన్‌ బాబు గురువారం జగన్‌తో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో భేటీ అయ్యారు. వైయస్ ఆర్‌ సోదరుడు సుధీకర్‌ కుమార్తె వెరోనికా రెడ్డిని విష్ణు వివాహమాడిన సంగతి తెలిసిందే.

మోహన్ బాబు చాలాకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం కూడా పొందారు. చంద్రబాబు నాయుడితో సరిపడక ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన గురువు దాసరి నారాయణరావు కాంగ్రెస్ లో చేరినప్పటినుంచి ఆయన కాంగ్రెస్ కు కొంచెం అనుకూలంగా ఉంటున్నట్టు కన్పిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X