హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాడి తండ్రి చిరంజీవి, అందుకే అంత ఎత్తుకు...

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: మెగాస్టార్, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి నిన్న సాయంత్రం ఆంధ్రజ్యోతి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. చిరంజీవి తన వ్యక్తిగత, కుటుంబగత విషయాలను ఇంత సవివరంగా చెప్పడం ఇదే మొదటిసారి.తాను సొంతంగా కష్టపడి పైకొచ్చానని, తన కుమారుడు రామ చరణ్ తేజ తన ప్లాట్ ఫాం లో ఎదిగాడని ఆయన అన్నారు.

ఆయన మాటల్లోనే కొన్ని విషయాలు: "మా ఫాదరేం చిరంజీవి కాదు. వాడి బాబు చిరంజీవి. అందుకనే వాడు నన్ను ప్లాట్‌ఫాం చేసుకుని ఎదిగాడు కాబట్టి నాకన్నా ఎత్తులో కనపడతాడు!.. నాతో కలిసి నటించాలని చరణ్‌ కోరిక. మగధీరలో కాసేపు మమ్మల్నిద్దరినీ తెరమీద చూసినపుడు, మొత్తం సినిమా చేస్తే బాగుంటుందని నా భార్య సురేఖ కూడా అన్నది. ఇంట్లో సినిమా అలవాటైన మాకే అలా ఉంటే, మమ్మల్ని తెరమీద చూసి అభిమానించేవాళ్లకు ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ల కోరిక బలంగా ఉంటే బహుశా జరగచ్చు. తథాస్తు దేవతలు కూడా అలాగే అంటే శిరసావహిస్తాను..."

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X