విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడి వద్ద రాసలీలలపై రహస్య విచారణ

By Santaram
|
Google Oneindia TeluguNews

Kanakadurga Temple
విజయవాడ: దుర్గగుడి ప్రాంగణంలో ఈనెల 6న చోటుచేసుకున్న రాసలీలల ఘటనపై విచారణ ప్రారంభించినట్లు కనకదుర్గగుడి సహాయ కమిషనర్‌ శారదకుమారి సోమవారం చెప్పారు. తనను కలిసిన విలేఖరులతో ఆమె మాట్లాడుతూ, ఎల్రక్టీషియన్‌ ప్రసన్నకుమారి రాత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని, మీడియా కథనం మేరకు విచారణ చేపట్టినట్లు చెప్పారు. విచారణ ఆంత రంగికంగా జరుగుతుందన్నారు. ఈ సంఘటన గురించి తెలిసినవారు సమాచారంఇస్తే స్టేట్‌మెంట్‌ తీసుకుంటామన్నారు.

ఎలక్ట్రికల్ విభాగం అధికారిణి ప్రసన్న కుమారి, ఈవో పిఎ రమణారావు రాసలీలలు జరుపుతుండగా సిసి కెమెరాలకు చిక్కారు. ఆ వివరాలివి : బెజవాడ కనకదుర్గమ్మ గుడి ప్రాంగణంలోనే రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ఆలయం ఉద్యోగులే నీచానికి పాల్పడిన సంఘటన శుక్రవారం బట్టబయలైంది. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో ఆలయం ఉద్యోగి ఒకరు మరో ఉద్యోగినితో రాసలీలలు నెరపుతున్న దృశ్యాలను సిసి కెమెరా బంధించింది.

ఈ సమాచారం బయటికి పొక్కడంతో సంచలనం చెలరేగింది. ఆలయం కార్యనిర్వహణాధికారి పి.ఎ.గా ఉన్న రమణారావు దుర్గగుడి ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న మరో మహిళా ఉద్యోగినితో నిర్వహిస్తున్న రాసలీలల దృశ్యాలు సిసి కెమెరాలో చిక్కాయి. దేవాదాయ కమిషనర్ సుందరకుమార్ ఆలయంలో ఉండగానే ఈ వ్యవహారం జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దుర్గ గుడి బోర్డు సమావేశం హాలులో ఆ ఉద్యోగి దుశ్చర్యకు పాల్పడడం గమనార్హం. మహిళా ఉద్యోగినిని ముద్దు పెట్టుకుంటుండగా సిసి కెమెరాలు ఆ దృశ్యాన్ని చిత్రీకరించాయి.

ఈ విషయం తెలిసిన వెంటనే ఆలయం అధికారులు సిసి కెమెరా ఉన్న గదికి తాళం వేశారు. గుడి పవిత్రత కంటే సమావేశమే ముఖ్యమని అధికారులు వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయం. ఇలా ఉండగా ఎంతో పవిత్రంగా తామంతా భావిస్తున్న ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఉద్యోగులు నీచమైన పనులకు పాల్పడడంతో భక్తుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. గుడిలో అపచారాలు ఎన్నోసార్లు జరుగుతున్నాయని, అయితే, సిసి కెమెరాలో చిక్కడం మాత్రం ఇదే తొలిసారి అని భక్తులు ఆరోపిస్తున్నారు. అసభ్యంగా ప్రవర్తించిన ఆలయం ఉద్యోగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X