హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి కేసులకు బెదిరేది లేదు: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిపతి, కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆరోణలు కొత్తమీ కాదని, గాలి జనార్దన్ రెడ్డి కేసులకు, విమర్శలకు బేదిరేది లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. ఓబుళాపురం గనుల అక్రమాలపై చర్చకు శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగైదేళ్లలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ తవ్వకాల ద్వారా పది వేల కోట్ల రూపాయలు ఆర్జించిందని ఆయన విమర్శించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ రోజుకు ఏడెనిమిది కోట్ల రూపాయలు ఆర్జిస్తోందని, అందుకే అందరినీ కొనగలుగుతోందని ఆయన అన్నారు. మీడియాను, రాజకీయ నేతలను ఎవరిని పడితే వారిని కొంటున్నారని, లొంగకపోతే బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పక్కన ఉన్న సంస్థలను నయాన, భయాన స్వాధీనం చేసుకున్నారని ఆయన అన్నారు. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంపై సిబిఐ చేత లేదా ప్రత్యేక సంస్థ చేత దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబుళాపురం అక్రమాలపై జాతీయ స్థాయిలో ఉమ్మడి ఉద్యమం చేపడతామని ఆయన చెప్పారు. తొలుత ఈ నెల 16వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఓబుళాపురం మైనింగ్ పై రాష్ట్రపతికి, ప్రధానికి, సిబిఐకి, సివిసికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనుమతులిచ్చిందని ఆయన విమర్శించారు. గెలాక్సీ, ముడి ఇనుము ఎగుమతికి తమ ప్రభుత్వ హయాంలో రూపొందించిన నిబంధనలను కాంగ్రెసు ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా అక్రమ వ్యాపారం కోసం ఒక్కటయ్యారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చెల్లించిన ముందస్తు పన్ను ప్రకారం వార్షికాదాయం 70 కోట్ల రూపాయలపైనే ఉంటుందని ఆయన చెబుతూ అంత ఆదాయం ఎలా వచ్చిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓబుళాపురం గనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని డిఎఫ్ఓ కూడా నిర్ధారించారని ఆయన చెప్పారు. ఓబుళాపురం కంపెనీ నిబంధనలను అతిక్రమించి చారిత్రక అవశేషాలను కూడా ధ్వంసం చేసిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని ఓబుళాపురం కంపెనీ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. గత ఐదేళ్లుగా జరుగుతున్న అక్రమాలపై సాక్ష్యాధారాలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని ఆయన చెప్పారు.

మైనింగ్ మాఫియా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ విచారణాధికారి సమ్మిరెడ్డి నిజాలను తేల్చేది ఏమీ లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే మైనింగ్ ను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. సమ్మిరెడ్డి కమిటీ తేల్చేది ఏమీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. త్రిసభ్య కమిటీ విచారణ బహిరంగంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విమర్శించారు. రాష్ట్ర సరిహద్దులను నిర్ణయించే జిటిఎస్ ను కూడా కూలదోశారని ఆయన అన్నారు. సర్వే ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఉమ్మడి విచారణకు ఆదేశించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓబుళాపురం వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ప్రజారాజ్యం, బిజెపిలు హాజరు కాలేదు. తాము కాంగ్రెసు పార్టీని మినహా అన్ని పార్టీలను ఆహ్వానించామని చంద్రబాబు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X