హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మైనంపల్లి రాజీనామా చేస్తారా: హరీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తనపై భూ ఆక్రమణ ఆరోపణలు రుజువు చేయకపోతే తెలుగుదేశం శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు హరీష్ రావు సవాల్ చేశారు. తాను మెదక్ జిల్లా రాఘవాపూర్ లో 110 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నట్లు మైనంపల్లి హనుమంత రావు చేసిన ఆరోపణను ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు.

హనుమంతరావు రాఘవాపూర్ కు వచ్చి మీడియా తదితరుల ముందు తనపై చేసిన భూ అక్రమ ఆక్రమణ ఆరోపణలను రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేపడతానని హనుమంతరావు చేసిన ప్రకటనపై కూడా ఆయన ప్రతిస్పందించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన బంధువులు రాఘవాపూర్ లో భూములు ఆక్రమించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. లక్ష్మీనగర్ లో ఎవరి మీద కూడా ఆరోపణలు చేయలేదని, దళితుల భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం దళితులకు తిరిగి అప్పగించాలని కోరామని ఆయన చెప్పారు. దళితుల భూములను దళితులకు ఇవ్వకుండా తమపై ఆరోపణలు చేస్తున్నారని, ఈ విషయంలో తెలుగుదేశం వైఖరి స్పష్టం చేయాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X