వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెడ్లీ'రాహుల్' మహేష్ భట్ కుమారుడు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul
ముంబై: భారతదేశంలో ముంబై తరహా దాడులకు కుట్ర చేసిన డేవిడ్ కొలెమన్ హెడ్లీ పేర్కొన్న వ్యక్తి ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కుమారుడని తెలుస్తోంది. భారతదేశంలోని రెండు ప్రముఖ పాఠశాలలపై, నేషనల్ డిఫెన్స్ కాలేజీపై లష్కరే తోయిబా దాడులకు కుట్ర పన్నిన వ్యవహారంలో హెడ్లీని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) నెల రోజుల క్రితం అరెస్టు చేసింది.

హెడ్లీ లష్కరే తోయిబా నేతలకు చేసిన ఇ - మెయిల్ లో రాహుల్ అనే పేరు పలు మార్లు ప్రస్తావించాడు. అయితే ఆ రాహుల్ షారూఖ్ ఖాన్ గానీ రాహుల్ గాంధీ గానీ కావచ్చుననే ఊహాగానాలు చెలరేగాయి. అయితే అతను ఫిట్నెస్ ఇన్ స్ట్రక్టర్, బాడీ బిల్డర్ 25 ఏళ్ల రాహుల్ భట్ అని తెలుస్తోంది. ఇతను మహేష్ భట్ కుమారుడు. జిమ్ లో రాహుల్ భట్ కు హెడ్లీతో పరిచయమైంది. అయితే రాహుల్ కు అతను ఏమిటో తెలిసి ఉండదని పోలీసులు అంటున్నారు. రాహుల్ ను దర్యాప్తు అధికారులు విచారించి క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X