వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరీన అర్థనగ్న పోస్టర్లు: సేన చిందులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kareena Kapoor
ముంబై: కరణ్ జోహర్ మరో సినిమా వివాదంలో చిక్కుకుంది. కుర్బాన్ సినిమాలో నగ్నమైన వీపు గల కరీనా కపూర్ పోస్టర్లపై శినసేన కార్యకర్తలు చిందులు వేస్తున్నారు. దాదాపు వంద మంది శివసేన కార్యకర్తలు వీధులకెక్కి జుహు, మరోల్, తదితర ప్రాంతాల్లోని పోస్టర్లను చించివేశారు. వేక్ అప్ సిధ్ సినిమాలో ముంబైకి బదులు బొంబాయి అని వాడినందుకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

కరీనా కపూర్ అర్థనగ్న పోస్టర్లను వేశారని, ఇది దురలవాటు అని, అందువల్లనే తాము వ్యతిరేకిస్తున్నామని శివసేన నాయకుడు సుభాష్ కాంత సావంత్ అన్నారు. అది భారత సంస్కృతికి విరుద్ధమని ఆయన అన్నారు. కరీనా పోస్టర్లపై కొంత శివసైనికలు చీరలు కప్పారు కూడా. కొంత మంది కరీనా కపూర్ ఇంటికి వెళ్లి ఆమెకు చీరలు ప్రదానం చేయడానికి ప్రయత్నించారు. శివసేన కార్యకర్తలపై కేసు నమోదు చేయాలని ఖార్ పోలీసులకు సూచించినట్లు అదనపు పోలీసు కమిషనర్ అమితాబ్ గుప్తా చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X