వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి ఎమ్మెల్యే మైనంపల్లి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

మెదక్: మెదక్ జిల్లాలోని రాఘవాపూర్ భూవివాదంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావుతో బహిరంగ చర్చకు బయలుదేరిన తెలుగుదేశం శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావును పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధిపేట సమీపంలోని హుస్నాబాద్ చౌరస్తా వద్ద ఆయనను శనివారం అరెస్టు చేశారు. రాఘవాపూర్ లో దళితుల భూములను ఆక్రమించుకున్నారని తాను చేసి ఆరోపణపై హరీష్ రావుతో బహిరంగ చర్చకు ఆయన సిద్ధపడ్డారు.

భారీ కాన్వాయ్ తో మైనంపల్లి హనుమంతరావు రాఘవాపూర్ కు బయలుదేరారు. తెలుగుదేశం కార్యకర్తలు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకు ముందే హరీష్ రావును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గం ప్రజలను కలుసుకోకుండా తనను ఎవరూ ఆపలేరని హరీష్ రావు అన్నారు. అయితే 144వ సెక్షన్ అమలులో ఉన్నందననే హరీష్ రావును, రామలింగారెడ్డిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X