హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలీ! కుల రాజకీయాలేలా?: నన్నపనేని

By Pratap
|
Google Oneindia TeluguNews

Nannapaneni Rajakumari
హైదరాబాద్: కర్నాటక మంత్రి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దన్ రెడ్డికి కుల రాజకీయాలు తగవని తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి సూచించారు. రెడ్డిని కాబట్టే తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబునాయుడు తనపై ఆరోపణలు చేస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి చేసిన ఆరోపణను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యను ఆయన నివాసంలో కలిసిన తర్వాత ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కుల రాజకీయాలకు తాము వ్యతిరేకమని, వాటిని అడ్డం పెట్టుకుని ప్రజలను తప్పు తోవ పట్టించే ప్రయత్నం చేయడం సరి కాదని ఆమె అన్నారు.

ఓబుళాపుంర మైనింగ్ కంపెనీపై విచారణకు వెళ్లిన అధికారులను అడ్డుకున్నారని, దీన్ని బట్టే అక్రమాలు ఏ రీతిలో జరిగాయో అర్థమవుతోందని ఆమె అన్నారు. మీడియా తీరుపై కూడా ఆమె గుర్రుమన్నారు. తాము ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా మీడియా హోటల్లో సమావేశం ఏర్పాటు చేసిన గాలి జనార్దన్ రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చిందని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X