హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆందోళనకరంగా 4గురు జూడాల ఆరోగ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Doctors
హైదరాబాద్: ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆరుగురు జూనియర్ డాక్టర్లలో నలుగురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారికి వైద్యులు మంగళవారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి వెంటనే వైద్య సహాయం అందించకపోతే ప్రమాదకరమని గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్ చెప్పారు. కాగా, తాము దీక్ష విరమించే ప్రసక్తి లేదని జూనియర్ డాక్టర్లు మొండికేస్తున్నారు.

ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లను అరెస్టు చేసేందుకు పోలీసులు మంగళవారం కూడా ప్రయత్నించారు. అయితే పోలీసులను జూనియర్ డాక్టర్లు లోనికి రానీయడం లేదు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్ల గదికి సహచరులు తాళాలు వేశారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత జూడాలను అరెస్టు చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. గాంధీ ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సోమవారం రాత్రి కొద్దిసేపు అత్యవసర సేవలను కూడా నిలిపేసిన జూడాలు మంగళవారం వాటికి హాజరయ్యారు. రోగులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే తాము అత్యవసర సేవలకు హాజరవుతున్నట్లు వారు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X