హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూడాల ఆమరణ దీక్ష భగ్నానికి యత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Doctors
హైదరాబాద్: ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు గాంధీ ఆస్పత్రి వద్గ గల జూడాల ఆమరణ నిరాహార దీక్ష శిబిరానికి పెద్ద యెత్తున చేరుకున్నారు. జూనియర్ డాక్టర్ల దీక్షను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నింాచరు దీన్ని జూడాలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఆమరణ దీక్షను భగ్నం చేయడానికి వచ్ిచన పోలీసులు హాస్టల్లోకి ప్రవేశించి తమపై దాడి చేశారని జూడాల సంఘం నాయకుడు కిశోర్ ఆరోపించారు. తమపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

జూడాలు భవనం మూడో అంతస్థులో ఆమరణ నిరాహార దీక్ష సాగిస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తమ ఆందోళనను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఓ జూనియర్ డాక్టర్ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గి వెళ్లిపోయారు. నిపుణుల కమిటీ సూచనలను అమలు చేసే వరకు ఆందోళన సాగిస్తామని జూనియర్ డాక్టర్లు చెప్పారు. కాగా, మంగళవారం నుంచి అత్యవసర సేవలకు హాజరు కావాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే తాము అత్యవసర సేవలకు హాజరు కావాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X