వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇడికి ఆ అధికారం లేదు: మధు కోడా

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Koda
రాంచీ: తనకు సమన్లు జారీ చేసే అధికారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు లేదని జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కోడా అన్నారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. పార్లమెంటరీ హక్కులను ప్రస్తావిస్తూ పార్లమెంటు సభ్యుడిగా ఏకపక్షంగా ఇడి తనకు సమన్లు జారీ చేయడం సరికాదని, కనీసం 30 రోజుల ముందుగా తనకు నోటీసు ఇవ్వాలని ఆయన అన్నారు. మనీ లాండరింగ్, అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మధు కోడా విచారణ నుంచి తప్పించుకోవడానికి ఇంతకు ముందు ఆరోగ్యాన్ని కారణంగా చూపారు. ఇప్పుడు ఈ సరికొత్త ఎత్తుగడను ఎంచుకున్నారు.

గురువారం ఆయన ఇడి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ దానికి ఆయన హాజరు కాలేదు. తాను పార్లమెంటు శీతాకాలం సమావేశాలకు హాజరవుతానని ఆయన చెప్పారు. మధు కోడా తాజా కొర్రీపై ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు ఏమీ మాట్లాడడం లేదు. తగిన నిర్ణయం తీసుకుంటామని వారు చెబుతున్నారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని కోడా ఇంతకు ముందు అన్నారు. మధు కోడాను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేయవచ్చుననే వార్తలు కూడా వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X