హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య, చంద్రబాబు సవాళ్ల పోరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah-Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.రోశయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పరస్పరం మాటల యుద్ధానికి దిగారు. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంపై చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కె. రోశయ్య తీవ్రంగా ప్రతిస్పందించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై చంద్రబాబును ఆయన సవాల్ చేశారు. తమ కాంగ్రెసు పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు ఎక్కువ వచ్చినా తమ అధిష్టానానికి చెప్పి తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే చంద్రబాబు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏ వేదిక మీదనైనా తాను చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. జీతగాడు, అవినీతి అనే మాటలు చంద్రబాబుకే వర్తిస్తాయని ఆయన విరుచుకుపడ్డారు.

రోశయ్య ప్రతిస్పందించిన తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. తాము ఒక్కటి కోరితే రోశయ్య మరోదానికి ప్రతిస్పందిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికలకు, అక్రమాలకు ఎలా ముడిపెడతారని ఆయన ప్రశ్నించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలపై తాము మాట్లాడుతుంటే రోశయ్య గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముడి పెడుతున్నారని ఆయన ఆదివారం అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి గనులను మూసేయాలని సుప్రీంకోర్టు సాధికార కమిటీ సూచించలేదా అని ఆయన అడిగారు. తాము ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై మాట్లాడుతుంటే రోశయ్య ఎదురుదాడికి దిగురుతున్నారని ఆయన తప్పు పట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X