విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గనుల తవ్వకాలపై జీయర్ స్వామి అభ్యంతరం

By Santaram
|
Google Oneindia TeluguNews

Jeeyar Swamy
విజయవాడ: ఖనిజాల పేరుతో భూమిలో విచక్షణారహితంగా తవ్వకాలను జరిపి భూమాతను నిస్సారం చేయడం ప్రపంచ మానవాళికి అంత క్షేమదాయకం కాదని పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి ప్రవచించారు. గుంటూరు జిల్లా సీతానగరంలోని జీయర్‌స్వామి ఆశ్రమంలో ఇటీవల వరద బాధితులను ఆదుకున్న దాతలకు జరిగిన సన్మాన సభలో స్వామి వారు మంగళా శాసనాలు చేశారు. జీయర్‌స్వామి మాట్లాడుతూ ప్రకృతిని ప్రతి ఒక్కరూ ప్రేమించాలని, భూమి తల్లిని ఆదరించాలని అన్నారు. ఓబుళాపురం గనుల అక్రమాలు బయటికి వచ్చినప్పుడే స్వామి వారు తన ప్రవచనంలో తవ్వకాల వల్ల అనర్ధాల ప్రస్తావన రావడం విశేషం.

నేడు భూమాతను గ్యాస్‌, మైన్స్‌, ఆయిల్‌ అంటూ ఖనిజాల పేరుతో తవ్వకాలు జరిపి ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. ఆఖరుకు ఓజోన్‌పొర సైతం మానవాళి చర్యల వల్ల అదృశ్యమయ్యే ప్రమాదం ఏర్పడిందని స్వామిజీ అన్నారు. ప్రకృతి ఉపద్రవాలు పెరుగడానికి మానవ చర్యలే కారణమని స్వామిజీ అన్నారు. వాతావరణాన్ని మానవ జీవనానికి అనుకూలించని పరిస్థితులు మానవాళి కల్పిస్తుందని, సునామీ వంటి ఉపద్రవాలు ఏర్పడుతున్నాయని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X