వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలిపై క్రిమినల్ కేసులకు నారాయణ డిమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Narayana
తిరుపతి: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత, కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఓబుళాపురం గనుల్లో తవ్వకాలను నిలిపేయడం వల్ల మైనింగ్ మాఫియాను అడ్డుకోలేమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయాలంటే ముందుగా అనంతపురం జిల్లాలోని ఎస్సీ స్థాయి పోలీసు అధికారి నుంచి ఎస్సై స్థాయి అధికారి వరకు బదిలీ చేయాలని, అప్పుడే క్రిమినల్ కేసు పెట్టి గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయడానికి వీలవుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిపిఐ ఇక నుంచి ఏ విషయంలోనూ గవర్నర్ ను కలవకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X