వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూగో వాసి చే న్యూజిల్యాండ్ లో బాలాజీ గుడి

By Santaram
|
Google Oneindia TeluguNews

Balaji Temple
అమలాపురం: తన కలను సాకారం చేసుకునేందుకు ఐ.పోలవరం మండలం మురమళ్లకు చెందిన ప్రవాస భారతీయుడొకరు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆయన స్వప్నం కార్యరూపం దాలిస్తే న్యూజిలాండ్‌లో త్వరలో శ్రీవేంకటేశ్వరస్వామి కొలువు దీరనున్నారు. మురమళ్లకు చెందిన జంధ్యాల సతీష్‌ రెండున్నరేళ్లుగా న్యూజిలాండ్‌లోని వెల్లింగ్‌టన్‌లో ఆర్థోపెడిక్‌ వైద్యునిగా పనిచేస్తున్నారు. ఒకసారి కలలో సతీష్‌కు శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాలు దర్శనమివ్వడంతో ఆయన వెల్లింగ్‌టన్‌లో వేంకటేశ్వర ఆలయం నిర్మించాలని భావించారు.

కుటుంబ సభ్యులకు, స్నేహితుల సహకారంతో గత ఏడాదిగా ఆలయ నిర్మాణ సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఆయన శ్రీ బాలాజీ టెంపుల్‌ ట్రస్ట్‌ హమిల్టన్‌ అనే సంస్థ స్థాపించారు. మురమళ్ల వచ్చిన ఆయన గురువారం మీడియాకు ఆలయ నిర్మాణ వివరాలు తెలిపారు. రెండున్నర ఎకరాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సుమా రు ఐదు మిలియన్‌ డాలర్లు (మన దేశ కరెన్సీ లో సుమారు రూ.18 కోట్లు)తో నిర్మిస్తున్నట్టు తెలిపారు. తాను చైర్మన్‌గా ఉన్న ట్రస్టులో న్యూజిలాండ్‌లో స్థిరపడ్డ తమిళనాడు, శ్రీలంక తదితర ప్రాంతాలకు చెందిన ఐదుగురు శాశ్వత, మరో ముగ్గురు తాత్కాలిక సభ్యులుగా ఉన్నారన్నారు.

ట్రస్టు ఆధ్వర్యం లో న్యూజిలాండ్‌లోని భారతీయుల నుంచి, ఇతరుల వద్ద నుంచి విరాళాలు సేకరిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది జనవరి 23న వెల్లింగ్‌టన్‌లో సుమారు 101 దంపతులతో నిర్వహించే సుదర్శన హోమంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు సతీష్‌ వివరించారు. అన్ని అనుకున్నట్టు జరిగితే 2013- 14లోపు ఈ ఆలయాన్ని పూర్తి చేస్తామన్నారు. వెల్లింగ్‌టన్‌లో నిర్మించే శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్నికి అన్ని విధాలుగా సహకరించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంగీకరించినట్టు సతీష్‌ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X