వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లి చావుకు కారణమైన సాఫ్ట్ వేర్ ఇంజినీరు

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: వివాహ వేడుకలు జరగాల్సిన పెళ్లిపందిరిలో చావుబాజాలు మోగనున్నాయి. ఈ సంఘటన జరిగిన కశింకోట విషాదంలో మునిగిపోయింది. కశింకోటకు చెందిన పులపర్తి వెంకటేశ్వరరావు, సులోచన అనే దంపతులకు పిల్లలు లేకపో వడంతో తమ బంధువులకు చెందిన ఒక బాలుడిని చిన్నతనంలోనే దత్తత చేసుకొన్నారు. ఆ బాలుడికి శ్రీకాంత్‌ అని నామ కరణం చేశారు. తండ్రి వెంకటేశ్వర రావు విశాఖ పోర్టులో ఉద్యోగి కావడంతో శ్రీకాంత్‌ను ఎంతో గారాభంగా పెంచారు. ప్రస్తుతం శ్రీకాంత్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ తరుణంలో వీరికి దగ్గర బంధువైన ఎస్‌కోట గ్రామనివాసి శ్రీకాంత్‌ మేనమామ కుమారై స్వాతితో వివాహానికి నిశ్చయ తాంబూలాలు ఇచ్చుకున్నారు. పెళ్లికి పెద్దల అం గీకారంతో ఈ నెల 27న (శుక్రవారం) ముహూర్తం నిర్ణయించారు.

వివాహాన్ని ఘనంగా నిర్వహించడానికి అనకాపల్లిలో కళ్యాణ మండపాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ తరుణంలో శ్రీ కాంత్‌ పెండ్లి శుభలేఖలు ఇవ్వడానికి హైదరాబాద్‌ వెళ్లాడు. గురువారం తల్లి దండ్రులకు ఫోన్‌ చేసి తనకు ఈ పెళ్ళి ఇష్టంలేదని శ్రీకాంత్‌ చెప్పడంతో ఒక్కసారిగా ఆ దంపతులు షాక్‌కు గురయ్యారు. పెళ్ళి కుమారుడు తీసుకున్న నిర్ణయంతో అవమాన భారాన్ని తట్టుకోలేక తల్లడిల్లిన తండ్రి వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను విశాఖ కె.జి.హెచ్‌కు తరలిం చారు.ప్రస్తుతం ఆయన మృత్యువుతో పోరాడుతున్నాడు.తల్లి సులోచన కూడా కుమారుని నిర్ణయం తట్టుకోలేక సమీప వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంకటేశ్వర్లు పరిస్థితిని చూసి బంధువర్గం దుఖఃసాగరంలో మునిగిపోయింది. గురువారం సాయంత్రం నూతి నుండి సులోచన మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X