• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సత్యదేవుడిని దర్శించుకున్న సినీ హాస్యనటులు

By Santaram
|

Annavaram Temple
అన్నవరం: అన్నవరం శ్రీవీరవెంకట సత్యనారాయణస్వామివారిని బుధవారం పలువురు సినీ హాస్యనటులు దర్శించుకున్నారు. దర్శించుకున్న వారిలో చిట్టిబాబు, రాగిని, బెంగుళూరు పద్మ,జూనియర్‌ రేలంగి తదితరులు ఉన్నారు.

అనంతరం చిట్టిబాబు మాట్లాడుతూ నటనలో సాధారణంగా నటించడం కన్నా ప్రేక్షకులను నవ్వించడానికి నటించడం ఎంతో కష్టమని అన్నారు. గతంలో ఎందరో హాస్యనటులు హాస్యానికి జీవంపోసి పలు చిత్రాలు విజయవంతం కావడానికి కారణమయ్యారన్నారు. సినిమాలలో ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకునేది హాస్యమేనని ఈ సందర్భంగా తెలిపారు. అన్నవరం వచ్చిన వీరికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X