వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమకే ఫ్లోర్ లీడర్ పదవి: టిజి వెంకటేష్ డిమాండ్

By Santaram
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
హైదరాబాద్: రాయలసీమ ప్రాంతానికి ఫ్లోర్‌ లీడర్‌ పదవి కావాలని శుక్రవారం కర్నూలు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టిజి వెంకటేష్‌ డిమాండ్‌ చేసారు. అధినాయకత్వానికి తామంతా విధేయులమంటూనే శాసనసభలో రాయలసీమ ప్రాంతం వారికి సముచిత స్థానం ఇచ్చి తీరాలని ఆయన స్పష్టం చేసారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని తామంతా సంతకాలు చేసిన మాట వాస్తవమేనని, అధిష్టానం దృష్టికి వెళ్ళేలా తమ అభిప్రాయాలు తెలియజేయడంలో అవాస్తవం ఏదీ లేదని ఆయన తెలిపారు.

అధిష్టానం చెప్పిన విధంగా నడుచుకుంటామని, అయితే జగన్‌ భవిష్యత్‌ సహా పలు అంశాలపై అధిష్టానం తమ వైఖరిని వెల్లడించాలని టి.జి. వెంకటేష్‌ కోరారు.టిజి వెంకటేష్ రాయలసీమ ఉద్యమకారుడు. తెలంగాణ కంటే ఎక్కువ అన్యాయం సీమకు జరిగిందని ఆయన వాదిస్తూ వస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X