వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమాలకు సరిపోయే అందాలు విశాఖ

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: మరో సింగపూర్ లా అభివృద్ధి చెందుతున్నవిశాఖ మహా నగరం చిత్రసీమ కు చక్కని ప్రాంతమని, ఇక్కడి ప్రకృతి సౌందర్యం వెండి తెరకు బాగా సరిపోతుందని రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖా మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. గురువారం స్థానిక హోటల్‌లో సిల్వర్‌ కోస్ట్‌ ఫిల్మ్‌ సొసైటీ లోగోను ఆయన ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. దూర ప్రాంతాల నుంచి చిత్ర నిర్మాణాల నిమిత్తం వచ్చేవారికి సిల్వర్‌ కోస్ట్‌ సేవలు ఉపయోగపడేలా కార్యక్రమాలను రూపొందించాలని నిర్వాహకులకు వెంకటరెడ్డి సూచించారు. విశాఖలో చిత్ర పరిశ్రమ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుం దని, ఇక్కడి సాంకేతిక నిపుణులు కూడా తమవంతు సహకారాన్ని అందిస్తూ నిర్మాతలకు, దర్శకులకు తోడ్పడాలన్నారు.

సిల్వర్‌ కోస్ట్‌ ఫిల్మ్‌ సొసైటీ గౌరవ అధ్యక్షుడు ఆచార్య బాబీ వర్ధన్‌ మాట్లాడుతూ, విశాఖను చిత్ర పరిశ్రమకు మరింత అనువైన ప్రోత్సాహకరమైన ప్రదేశంగా మార్చాలన్నదే తమ సొసైటీ ధ్యేయమన్నారు. బుల్లితెర సాంకేతిక విభాగంలో అపారమైన అనుభవం, సృజనాత్మక సాంకేతిక నిపుణుడిగా పేరొందిన కుర్రా విజయ్‌కుమార్‌ సార«థ్యంలో ఇక్కడి సాంకేతిక వర్గానికి అవసరమైన శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతాయన్నారు. ప్రముఖ చిత్ర దర్శకుడు పి.సునీల్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, మాజీ ప్రధా ని స్వర్గీయ ఇందిరాగాంధీ చెప్పినట్టు రక్తరహిత విప్లవం సినిమాలు ద్వారానే సాధ్యమవుతుందన్నారు.

సొసైటీ కార్యదర్శి, ఫ్యూచర్‌ ఫ్రేమ్స్‌ అధినేత కుర్రా విజయ్‌కుమార్‌ మాట్లాడు తూ, సినీ ప్రముఖులను విశాఖకు ఆహ్వానించి ఇక్కడ సామర్థ్యాన్ని వారికి తెలియజేసేందుకు తోడ్పడే బీచ్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌ను నిర్వహించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరనున్నామన్నారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, ప్రతినిధులు వాసు ప్రకా ష్‌, సరోజ తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X