కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రశేఖర రావుకు గృహ నిర్బంధం?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుకు ప్రభుత్వం గృహ నిర్బంధం విధించే అవకాశాలున్నాయి. ఆయన ప్రస్తుతం కరీంనగర్ లోని తన నివాసంలో ఉన్నారు. ఆయన ఆదివారం ఉదయం కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్ధిపేటకు బయలుదేరుతారు. ఈలోగానే ఆయనను కరీంనగర్ లో గృహ నిర్బంధం విధించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆంక్షలను ధిక్కరించి ఆయన సిద్ధిపేటకు బయలుదేరుతారని తెరాస నాయకుడు నాయని నర్సింహా రెడ్డి అన్నారు. తాము గాంధేయ మార్గంలో దీక్ష చేస్తామని, ఏ మాత్రం అల్లర్లకు దిగబోమని కెసిఆర్ శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ఎక్కడ అరెస్టు అక్కడ కెసిఆర్ తన దీక్షను ప్రారంభిస్తారని నాయని నర్సింహారెడ్డి చెప్పారు. అరెస్టు చేసి జైల్లో పెడితే జైల్లో దీక్ష చేస్తారని ఆయన చెప్పారు. కెసిఆర్ దీక్షను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లర్లకు దిగదలుచుకోలేదని, తమ పార్టీ కార్యకర్తలు కూడా గొడవలు చేయబోరని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్ దీక్ష నేపథ్యంలో శనివారం ఉదయం రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కె రోశయ్యతో భేటీ అయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X