హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సబితకు ఎమ్మెల్యే రెండో భార్య ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: తనను మోసం చేశాడని కరీంనగర్ జిల్లా రామగుండం శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణపై ఆయన రెండో భార్య విజయలక్ష్మి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేసింది. ఆమె శనివారం ఉదయం సబితా ఇంద్రారెడ్డిని కలిసింది. తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు వదిలించుకోవడానికి చూస్తున్నాడని ఆమె సత్యనారాయణపై ఫిర్యాదు చేసింది. సత్యనారాయణతో తాను 11 ఏళ్లు కాపురం చేశానని, ఇప్పుడు తనను మోసం చేయడానికి చూస్తున్నాడని ఆమె అంటోంది.

సత్యనారాయణపై ఆమె ఇదివరకే హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేసింది. ఆమె ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు పట్టించుకోవడం లేదని విజయలక్ష్మి సబితకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు అధికారులను కోర్టు ఆదేశం మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తానని హామీ ఇచ్చినట్లు విజయలక్ష్మి చెప్పింది. సత్యనారాయణతో కలిసి తీసుకున్న ఫొటోలను విజయలక్ష్మి శుక్రవారం వివిధ చానెళ్లలో చూపించారు. అయితే సత్యనారాయణ తనను పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు లేవని ఆమె చెబుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X