మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెదక్ ఎస్పీ ఆఫీసు వద్ద విజయశాంతి అరెస్టు

By Santaram
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
మెదక్‌: తెలంగాణ రాష్ట్ర సమితి నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మెదక్‌ ఎంపీ విజయశాంతి ఆందోళనకు దిగారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన విజయశాంతిని పోలీసులు అరెస్టుచేశారు. కొంత కాలంగా కెసిఆర్ వ్యవహార శైలి నచ్చని విజయశాంతి టీఅర్ఎస్ రెబల్ నాయకురాలిగా వ్యవహారాలు సాగించారు.

కేసీఆర్‌ దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నట్లు టీవీ చానళ్లకు ఫ్యాక్స్‌ ద్వారా ప్రకటన పంపిన రాములమ్మ శనివారం కూడా చానళ్లకే మళ్లీ ఒక ప్రకటన పంపించారు. జనశక్తి నేత కూర రాజన్న అరెస్టును ఖండిస్తూ ఇలాంటి అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని పేర్కొన్నారు. ఆదివారమే ఆమె హైదరాబాద్ నుంచి సంగారెడ్డి చేరుకుని ఆందోళనకు దిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X