రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాటన్ మనవడు రాబర్ట్ దంపతుల పులకింత

By Santaram
|
Google Oneindia TeluguNews

Rajahmundry
రాజమండ్రి: 'ఎప్పుడో మా ముత్తాత మీకు చేసిన మేలును ఇప్పటికీ గుర్తు పెట్టు కుని ఆయన వారసుడైన నాపై మీరు చూపుతున్న ప్రేమను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ తీపి గురుతులను నేను ఎన్నటికీ మరు వలేను. ఆయన వంశంలో పుట్టడం నిజంగా నా అదృష్టం' అని చార్లెస్‌ రాబర్ట్‌ కాటన్‌ పులకించిపోయారు. గోదావరి జిల్లాలను క్షామం నుంచి గట్టెక్కించిన మహనీయుడు సర్‌ఆర్థర్‌ కాటన్‌ మునిమనవడు ఆది, సోమవారాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

ఆది వారం సాయంత్రం ధవళేశ్వరం కాటన్‌ మ్యూజియంలో రాబర్ట్‌ చార్లెస్‌ కాట న్‌ దంపతులకు ఘన సన్మానం జరిగిం ది. నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రు లు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ అరుణ్‌కుమార్‌, ఎమ్మె ల్యే రౌతు సూర్యప్రకాశరావు, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ బీపీబీకే సత్యనారా యణరావు తదితరులు రాబర్ట్‌ కాటన్‌ ను సన్మానించారు. మంత్రి బోస్‌, పొన్నాల, ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ లు మాట్లా డుతూ కాటన్‌ ఆశయాలను వైఎస్‌ కొనసాగించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాటన్‌ మ్యూజి యంలో ఉన్న ఆనకట్ట నమూనాలను, కాటన్‌ ఉపయోగించిన వస్తువులను, ఇంజనీరింగ్‌ సామగ్రిని రాబర్ట్‌ దంప తులు చూసి గర్వంగా ఫీలయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X