• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతా: కృష్ణంరాజు

By Santaram
|

Krishnam Raju
అన్నవరం: తాను ఏపార్టీలో చేరనున్నదీ వచ్చే ఏడాది ప్రకటిస్తానని మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు తెలిపారు. ఆదివారం ఆయన అన్నవరంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా తప్పటడుగు వేసినందున ప్రస్తుతం మౌనంగా ఉండాల్సి వచ్చిందన్నారు. వచ్చే ఏడాది నుంచి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానన్నారు. ప్రజారాజ్యానికి రాజీ నా మా చేసిన తరువాత తనను కాంగ్రెస్‌, బీజేపీ ఆహ్వానించాయన్నారు. రాజకీయాల నుంచి వై దొలుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. ఆయన బిజెపి కంటేకాంగ్రెస్ లో చేరే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.

తన సొంత బ్యానర్‌ 'గోపీ కృష్ణ' బ్యానర్‌ పై వచ్చే ఏడాది రెండు సినిమాలు నిర్మించనున్నట్టు ఆయన వెల్లడించారు. వీటిలో ఒక దానిలో ప్రభాస్‌ హీరోగా నటిస్తారన్నారు. స్వామివారి దర్శనమనంతరం వేదపండితులు వేదాశీస్సులందజేశారు. స్వామివారి ప్రసాదాన్ని సీఆర్‌ఓ కృష్ణారావు అందజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X