ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషమిస్తున్న కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. కెసిఆర్ జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. చికిత్స చేయించుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఉషారాణి మరోసారి కెసిఆర్ ను కోరారు. అయితే ఆయన అందుకు నిరాకరిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కెసిఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, పత్రికా కార్యాలయాలకు, మానవ హక్కుల కమిషనర్ సుభాషణ్ రెడ్డికి ఫోనులు చేసి మాట్లాడడంతో ఖమ్మం ఆస్పత్రిలో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. పోలీసులు తనపై తీవ్రమైన దౌర్జన్యం చేస్తున్నారని కెసిఆర్ ఆరోపించారు. సుభాషణ్ రెడ్డి జోక్యంతో పోలీసులు ఆస్పత్రిని ఖాళీ చేశారు. కెసిఆర్ వద్ద పోలీసులు ఎవరూ లేకుండా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఆయన వద్ద ఉన్నారు.

ఆమరణ నిరాహార దీక్షను కెసిఆర్ తనంత తానుగా ఏ షరతులు పెట్టకుండా విరమించారనే అపోహతో విద్యార్థులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ కు వ్యతిరేకంగా మంగళవారం ఆందోళనలకు దిగారు. తెరాస నాయకులు, తెరాస సిద్ధాంతకర్త జయశంకర్ వివరణ ఇవ్వడంతో వారు శాంతించి, కెసిఆర్ కు అనుకూలంగా మారారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X