• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పుట్టిన ఊరికి ఏం చేశావ్? అక్కినేనికి చేదు అనుభవం

By Santaram
|

Akkineni Nageswara Rao
గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని సొంత ఊరిలో నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురైంది. ఇంత సంపాదించుకున్నా సొంత ఊరికి ఏం చేశావంటూ కొందరు గ్రామస్ధులు అక్కినేనిని నిలదీశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో తాను పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటానని, ఆ మేరకు జన్మభూమికి జవసత్వాలు తీసుకువచ్చేలా సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తున్నామని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు బుధవారం పేర్కొన్నారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం రామాపురంలో అట్లూరి స్వామి, ఏఎస్‌ నారాయణలు ఏర్పాటు చేసిన 'అక్కినేని కళాకేంద్రం'ను మంత్రి గల్లా అరుణతో కలిసి ప్రారంభించారు.

అక్కినేని మాట్లాడుతూ తాను, అట్లూరి స్వామి రామాపురంలో జన్మించగా, ఏఎస్‌ నారాయణ సమీపంలోని వెన్ననపూడిలో జన్మించారని, తాము ముగ్గురం చిన్ననాటి స్నేహితులుగా సొంత గడ్డకు చేయూతనివ్వాలని సంకల్పించామన్నారు.

భారతదేశంలో పుట్టి విదేశాల్లో నివసిస్తున్న వారందరూ వారి ఆదాయంలో 5 శాతం మొత్తాన్ని తాము జన్మించిన ప్రాంతాలకు సాయంగా అందించి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్‌ పీయూష్‌కుమార్‌ మాట్లాడుతూ అక్కినేని పుట్టిన గ్రామానికి సేవ చేయడం అభినందనీయమన్నారు.

మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కృష్ణా-పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతూ కుదరవల్లి వద్ద వంతెన నిర్మాణానికి అక్కినేని చొరవ తీసుకున్నారన్నారు. అమల మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమకు ఉన్న చెడు అలవాట్లను మానుకుంటే సుఖంగా జీవించవచ్చన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X