వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమ: హోంగార్డు ఆత్మహత్యా యత్నం

By Santaram
|
Google Oneindia TeluguNews

Krishna District
మచిలీపట్నం: పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవటంతో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు యత్నించారు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కూడూరుకు చెందిన పామర్తి శ్రీనివాసరావు అదే గ్రామానికి చెందిన అనురాధ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీనివాసరావు నాలుగు నెలలుగా హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పెడన పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో బుధవారం శ్రీను తన కుటుంబసభ్యులతో ప్రేమ విషయం చెప్పాడు. అనూరాధను వివాహమాడేందుకు అతని తల్లిదండ్రులు అంగీకరించలేదని తెలుస్తోంది. శ్రీను ఈ విషయం అనురాధకు వివరించాడు. దీంతో బుధవారం రాత్రి అనురాధ ఇంటిపక్కనే ఇద్దరు నిద్రమాత్రలు మింగారు. దీన్ని గమనించిన స్థానికులు వీరి తల్లిదండ్రులకు, 108కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ సిబ్బంది వీరిని బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గురువారం రాత్రి వీరిద్దరి పరిస్థితి మెరుగుపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X