వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ తీర్మానం పెడితే మద్దతు: టిడిపి

By Santaram
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan
హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ అంశంపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే తాము మద్దతు తెలుపుతామని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని సంయమనంతో వ్యవహరించాలని విద్యార్థిలోకానికి తెదేపా విజ్ఞప్తి చేసింది. ఉద్యమంపై తమ పార్టీ వైఖరి స్పష్టంగా లేదని వస్తున్న వార్తల్ని ఆ పార్టీ నేతలు నాగం జనార్థన్‌రెడ్డి, దేవేందర్‌గౌడ్‌లు తప్పుబట్టారు.

కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై నిత్యం ఆరా తీస్తున్న విషయాన్ని విద్యార్థులపై దాడికి ఖండించిన అంశాన్ని వారు గుర్తు చేశారు. తెలంగాణపై గతంలో చేసిన తీర్మానానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేయడం ఉద్యమం కాదని గాంధేయ మార్గంలోనే ఉద్యమం కొనసాగాలని హితవు పలికారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X