వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ కు మరిన్నిదళాలు, 144 సెక్షన్ 12 వరకు

By Santaram
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్‌: వరంగల్ నగరంలో 144 వ సెక్షన్ ను ఈనెల 12 వరకు పొడిగించారు. అదనపు పోలీసు దళాలను రప్పిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ పోరు రోజుకో తీరు కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో పోలీసులు భద్రతపై దృష్టి సారిస్తున్నారు. ఓరుగల్లులో ఇప్పుడు ఉన్న వారికి తోడు అదనపు బల గాలు మోహరించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ జిల్లాల రెండు రోజుల బంద్‌లో భాగంగా సోమవారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా ఐదు ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలను ఆదివారం జిల్లాకు రప్పించినట్లు సమాచారం.

ప్రత్యేక తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిరాహారదీక్ష సందర్భంగా జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో నవంబర్‌ 29 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు 144వ సెక్షన్‌ విధిస్తున్నట్లు ఇంతకు ముందే ప్రకటించారు. అయితే, టీఆర్‌ఎస్‌ ఆందోళనపై ప్రభుత్వం ఏమీ తేల్చకపోవడం... కేసీఆర్‌ ఆమరణ దీక్ష ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో 144 పోలీసు యాక్టు ఈ నెల 12వరకు అమలులో ఉంటుందని, 12 తర్వాత సడలించేది, లేనిది ప్రకటించనున్నట్లు ఆదివారం పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

అదనపు దళాలు తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో పాటు రెండో రోజైన సోమవారం బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు అదనపు బలగాలను మోహరించినట్లు తెలిసింది. ఎస్పీ షానవాజ్‌ ఖాసీం పర్యవేక్షణలో ఓఎస్‌డీ డాక్టర్‌ తరుణ్‌జోషి, ఏడుగురు డీఎస్పీలు, 27 మంది సీఐలు, 99 మంది ఎస్సైలతో పాటు సుమారు ఆరు వేల మంది సివిల్‌, ఆర్ముడ్‌ రిజర్వ్‌డ్‌, ఏపీఎస్పీ తదితర బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీటికి తోడు బాంబుస్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌, క్యాట్‌, షాడో పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. అయినా శాంతిభద్రతల పరిస్థితి ఏ మాత్రం అదుపు తప్పకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఐదు ప్లాటూన్ల ఏపీఎస్పీ బల గాలను జిల్లాకు రప్పించినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X