హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఎఫెక్ట్: ఐపిఎస్ అధికారి రవీంద్ర బదిలీ

By Santaram
|
Google Oneindia TeluguNews

TRS
హైదరాబాదు: ఐపిఎస్ అధికారి, డిసిపి స్టీఫెన్‌ రవీంద్రను ప్రభుత్వం బదిలీ చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై లాఠీ చార్జీకి ప్రధాన కారకులు డిసిపి స్టీఫెన్‌ రవీంద్ర అని టిఆర్‌ఎస్‌ నేతలు, విద్యార్థులు ఆరోపించిన విషయం తెలిసిందే. అతనిని డిస్మిస్‌ చేయాలని కూడా వారు డిమాండ్‌ చేశారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం స్టీఫెన్‌ రవీంద్రను బదిలీ చేసింది.

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోమవారం పెద్ద యెత్తున పోలీసులను మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దింపారు. తెలంగాణ విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఓయులోని విద్యార్థుల రిలే నిరాహార దీక్షల టెంట్లను పీకేశారు. ఆర్ట్స్ కళాశాల లోపలికి ప్రవేశించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నెల 10వ తేదీన విద్యార్థులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X