వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూ.గో ప్రజారాజ్యం నుంచి వలసలే వలసలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Prajarajyam
కాకినాడ: ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నాడు గంపెడాశలతో తెలుగుదేశం, కాంగ్రెస్‌ల నుంచి వలస వచ్చిన నేతలంతా ఇప్పుడు తమ పాత పార్టీల్లో చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొందరు కాంగ్రెస్‌ వైపు, మరికొందరు టీడీపీ వైపు దారి వెతుక్కుంటున్నారు. ఒకప్పుడు బీజేపీలో ఉండి సార్వత్రిక ఎన్నికలప్పుడు పీఆర్పీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అభ్యర్థిత్వం దగ్గర నుంచి పదవుల పంపకాల వరకు సరైన గుర్తింపు లభించలేదనే ఆవేదనతో వేమా చివరకు పీఆర్పీని విడిచిపెట్టేశారు. వేమా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగినా ఆయన మాత్రం 'సైకిల్‌' ఎక్కాలనే నిర్ణయానికి వచ్చారు. వేమా చివరికి ఈ నెల 15, 16 తేదీల్లో 'దేశం' తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రకటించారు.

జిల్లా యువరాజ్యానికి రాజీనామా చేసిన కుడుపూడి అశోక్‌ కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. పీఆర్పీ జిల్లా కన్వీనర్‌ జ్యోతుల నెహ్రూ, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, జెడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్‌, రాజమండ్రి మాజీ మేయర్‌ ఎం.ఎస్‌. చక్రవర్తి తదితర టీడీపీ వలస నేతలు తిరిగి 'సైకిల్‌' ఎక్కడమే ఉత్తమమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఏదో నిర్ణయం తీసుకోకపోవడానికి మూఢం ఒక కారణమైతే, స్థానిక ఎన్నికలకు ఇంకా సమయం ఉండడం మరో కారణంగా చెబుతున్నట్టు సమాచారం. ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు ఉండదనే విషయంపై మాత్రం నేతలు ఏకాభిప్రాయంతో ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X