మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం మహిళా డిఎస్పీ రాజీనామాకు సిద్ధం

By Santaram
|
Google Oneindia TeluguNews

Medak Dist
మెదక్‌: ఆంధ్రా పోలీసుల కింద తాను పనిచేయలేనని మెదక్ డిఎస్‌పి నళిని రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఈ విషయమై డిజిపిని కలిసేందుకు ఆమె వెళ్లారు. ఒక డిఎస్పీ స్ధాయి అధికారి తెలంగాణ కోసం రాజీనామాకు సిద్ధపడడం చర్చనీయాంశమైంది. ఇటీవల తెలంగాణ కోసం ఎఆర్ కానిస్టేబుల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

కాగా వరంగల్, కరీంనగర్ తర్వాత తెలంగాణ కోసం తీవ్రస్ధాయిలో ఉద్యమం మెదక్ లో జరుగుతోంది. టీఆర్‌ఎస్‌కు పురిటిగడ్డ అయిన జిల్లాలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆమరణ దీక్షకు నిర్ణయించిన గత నెల 29వ తేదీకి మూడు నాలుగు రోజుల ముందు నుంచే మొదలైన ఆందోళన పది రోజులవుతున్నా కొనసాగుతూనే ఉన్నది. ఉద్యమకారులలో జోరు, హుషారు తగ్గడం లేదు.

ఉద్యమం చేపట్టిన టీఆర్‌ఎస్‌కు బీజేపీ, ఏబీవీపీ, ఎమ్మార్పీఎస్‌ తదితర సంస్థలు తోడవడంతో రోజు ఎక్కడో ఒకచోట ఏదో రకమైన ఆందోళన, విధ్వంసం వంటి కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం కూడా జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, మెదక్‌, నారాయణఖేడ్‌ తదితర ప్రాంతాలలో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. అనేక ప్రాంతాలలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ముఖ్యమంత్రి రోశయ్యల దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహించి తగులబెట్టారు. గజ్వేల్‌లోనైతే ఏకంగా జిల్లాలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరి దిష్టిబొమ్మలను రూపొందించి దహనం చేశారు. కొండపాక మండలం మర్పడగలో రిలయన్స్‌ టవర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X