వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లగడపాటి రాజీనామా: భగ్గుమన్న ఆంద్రా ఎంపీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీలో తెలంగాణ ప్రకంపనలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన చేయడం కాంగ్రెసు ఆంధ్ర పార్లమెంటు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రంగా మనస్తాపం చెందిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు గురువారం రాజీనామా చేశారు. లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆయన తన లేఖను స్పీకర్ మీరా కుమార్ కు అందజేశారు. స్పీకర్ నివాసానికి వెళ్లి ఆయన ఈ లేఖను అందజేశారు.

తెలంగాణపై ఆంధ్రా ఎంపిలు బుధవారం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ వద్ద తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని వారు వీరప్ప మొయిలీకి చెప్పారు. వీరంతా తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నారు. చిదంబరం ప్రకటన వెలువడగానే ఆంధ్రా ఎంపీలు తీవ్ర అసంతృప్తితో మంతనాలు ప్రారంభించారు. గురువారం పార్లమెంటు ఆవరణలో కాంగ్రెసు ఆంధ్రా ఎంపీలు సమావేశమయ్యారు. తాము చర్చలు జరుపుతున్నామని, మధ్యాహ్నం ఈ విషయంపై మాట్లాడుతామని రాయపాటి సాంబశివ రావు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X