• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దీక్ష చేస్తున్న ఎయు విద్యార్థి మృతి

By Pratap
|

Andhra University Student
విశాఖపట్నం: సమైక్యాంధ్రకు మద్దతుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి సోమవారం మరణించాడు. నాలుగు రోజులుగా నలుగురు విద్యార్థులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో నారాయణ అనే ఎంబిఎ విద్యార్థిని విశాఖపట్నంలోని కెజిహెచ్ కు తరలించారు. అతను పొందుతూ సోమవారం మరణించాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కాగా, ఆంధ్ర, రాయలసీమల్లో సమైక్యాంధ్ర నినాదంతో ఆందోళనలు సాగిస్తున్నారు. రాజమండ్రిలోని శ్యామల సెంటర్ లో సోమవారం పది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కారు. అరెస్టు చేసిన కాంగ్రెసు పార్లమెంటు రాజగోపాల్ ను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, లగడపాటి అరెస్టుకు నిరసిస్తూ కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి రాస్తారోకో నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X